Ananthasai Sarath Chandra   (Ananth)
418 Followers · 207 Following

read more
Joined 1 April 2019


read more
Joined 1 April 2019
YESTERDAY AT 11:35

కరమే నీకు ఆయుధం - కష్టమే నీ సాయుధ బలగం
నీ శక్తే జగతిని నడిపే వాహకం - అనునిత్యము జరిగే
మంధనం ఆ రుధిర - ఘర్మ జలాలే గతిన ప్రగతి
రథాన్ని నడిపించే ఇంధనం కూడు పెట్టిన గూడు
కట్టిన నీ గోడు తలకెక్కని అసమర్ధపు మొద్దు
ప్రభుత్వాలు అక్కరకు రాని చట్టాలు ఒక్కరోజు
నువ్వు లేకపోతే దిక్కు తోచది ప్రజా-స్వామ్యులకు
నిన్ను చీత్కరిస్తున్న నువ్వు సాక్షాత్కరిస్తూనే ఉంటావు నిస్వార్ధమైన నీ సేవకి, త్యాగ నిరతికి లాల్ సలాం ఎర్ర సైనికుడా..✊

ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు..!!👏💐

-


YESTERDAY AT 0:00

మీకు ఇష్టమైన పాట
సిరివెన్నెల మృదు పదాల మూట
వేటూరి మధురపు భావాల ఊట
సినారె సుగంధాల మల్లెల తోట
శ్రీశ్రీ విప్లవాత్మక గీతాల బావుటా
ఎందరివో, మరెందరివో
కవులవి వినసొంపైనవి
వీనుల విందగు తెలుగు
మరియు ఇతర భాషలందు
శ్రుతిలో కుదిరిన, స్మృతిలో
మిగిలిన, గాయకుల గళ
సీమలో సాగిన పాటలన్నీ
ఇష్టమే.....!!

-



వేవేల ఆశలతో, కొంగొత్త కోరికలతో ఈ పరమ పవిత్రమైన రంజాన్ రోజున పరమ దయాళువైన ఆ అల్లా తన చల్లని శశి కిరణాల దృష్ఠి మీ అందరి పై ఎల్ల వేళలా ప్రసరించి నిత్య శుభాలతో కలగలిసిన సంపత్ సౌఖ్యాలను మరియు 'రోజా' ఫలాలను పరిపూర్ణంగా వర్షించి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికి మిత్రులకు, శ్రేయోభిలాషులకూ రంజాన్ శుభాకాంక్షలు..!! (ईद मुबारक)

-



నవ వసంతాలకు ఆది
కోయిల కూయు సరాగమిది
షడ్రుచుల సమ్మిళిత అమృత కాలమిది
విజయాలకు శుభ సూచకమిది
నూతానారంభాలకు పునాది
నడిచే గతి గమానాలకు వారధి
జీవనయానన్ని సాగించే సారధి
క్రోధితో చేయకు కాలాన్ని హృదికి విరోధి
సత్సంకల్పాలే మనకు పరమావధి
సుఖ సంతోషాలే కావాలి పెన్నిధి
ప్రతి సంవత్సరాది కావాలి ప్రమోది

అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు..!!

-



ఫోన్ కాల్స్ యుగంలో
ఇంస్టా రీల్స్ ప్రపంచంలో
ముఖపుస్తకపు పేజీలలో
యూట్యూబ్ షార్టులల్లో
మెయిల్స్ సంభాషణల్లో
ట్విట్టరు పక్షి కారుకూతల్లో
విహంగమై విశ్వాన్నంతా
చుట్టేస్తూ అంతర్జాలంతో
జీవితపు బంధాలను కట్టేస్తూ
కొత్త కొత్త పోకడలను మప్పేస్తూ
మనిషి మరబొమ్మకు అలవాటై
ప్రతిదీ క్షణక్షణంలో జరగాలని
కాంక్షిస్తూ ధనమే ప్రపంచమై
కాలమనే పోరులో ఎదురీదలేక
ఓడిపోతూ బతుకుతూ మనసు
విరుచుకుంటున్న మనిషి పదిలపరచి
నిత్యం జీవితాన్ని దిద్దు నగిషి....!!

-



కవులకు అదే ఓ మహా విశ్వం
హృదినెపుడు పరిగెడుతూ భావాశ్వం
పోగొడుతుంది తనలోని జడత్వం
భావాలంకరాలతో భాషకి స్థిరత్వం
కాల్చుతుంది పేరుకున్న మూఢత్వం
జ్ఞానంతో తొలుగుతుంది పశుత్వం
నింపుతూ చదువరులకు ఆత్మ చైతన్యం
చూపుతూనే దానికున్న అస్థిత్వం
అందిస్తుంది చీకటి తెరలను చీల్చి బ్రహ్మత్వం..!!

-



నవ్వుతున్న ముఖం మరుగవదా దుఃఖం
కటి నిశినార్పు దీపం కాలిపోదా కలవరం
ఆర్తిలోనే నాటుకుంటుంది ఆలోచనపు బీజం
నీ మతితోనే వర్షించు శీతల శశి కాంతి సారం
హృది కొలనులో పల్లవించదా పసిమి కల్హరం
కష్టం కురిమయున్న నిను కుంగనీయదు సుఖం
పెరగదా నీతోడు ఆశయాల పూల నందనవనం
కాలమే నీదైతే చేరదా జీవనం స్వర్గ సోపాన
సౌధం పండవా నిత్య వసంతపు
సంతసాలు కలకాలం..!!

-



సమయం క్షణక్షణం వినిమయం
కళలతో నింపుకున్న రసమయం
వెన్ను చరిస్తే వాలదే వీపుపై ఏ భయం
కదలక కూర్చుంటే రాదు నీకే జయం
సత్సంకల్పమే చాలదా నీకున్న అభయం
సుస్వప్నాలతో వెలిగిపోదా మహోదయం
నీలోని నవాంకురాలకది ఉషోదయం
జీవన ప్రగతికి చేరాలి అభ్యుదయం
ప్రతీ కాంక్షతో కావాలి విజయం..!!

-



ఓ కుసుమ భామా!
రవి సంచరిస్తున్నాడు
జాగ్రత సుమా....

-



మాతృత్వమే దాచుంచి అమృతత్వమే పంచి
బ్రహ్మత్వంతో బతుకులకు ఒక స్థిరత్వాన్నిచ్చి
అక్షరాలతో విజ్ఞానమయ కోశాన్నే నిండుగా నింపి
సృజనాత్మకతతో అద్భుతాలను ఆవిష్కరించి
చూపేదే మధురమైన మాతృ భాష అదే మనకు దశా దిశా..!!

-


Fetching Ananthasai Sarath Chandra Quotes