సులువు కాదు!
సులువు కాదు, రేపు ఎంటో తెలియని ప్రయాణం!
దిగులు లేదు, అనునిత్యం ఊపిరిలా ఉంటావన్న ధైర్యం!!
సులువు కాదు, ఇరువురి అభిప్రాయాలలో సయోధ్య కుదరటం!
ఆగలేదు, సమ్మతాన్ని తెలిపే నీ కళ్ళలోని దరహాసం!!
సులువు కాదు, మారుతున్న పరిస్థితుల ప్రభావం!
మారలేదు, సహనంతో ఎదురుకునే సహజగునం!!
సులువు కాదు, నిను వర్ణించే నా ప్రయత్నం!
తెలియలేదు, నేనిల రాయగలనని ఒక కావ్యం!!
-