QUOTES ON #సహాయం

#సహాయం quotes

Trending | Latest
1 JUN 2018 AT 21:01

నా జీవిత కథకి నేను పెట్టుకునే పేరు
నా సహాయం, నాకు లేదు సహాయం.

-


7 APR 2020 AT 17:55

ఉన్నోళ్ళకు ఎన్నోసార్లు అన్నం పెట్టిన మనం..
లేనోళ్ళకు ఆకలి తీర్చాల్సిన సమయమొచ్చింది..
మీకు దగ్గరలో ఉన్న అనాధ శరణాలయం,
అడుక్కునే వాళ్ళు ఎవరైనా కనిపిస్తే
తోచినంత ఏదైనా సహాయం చేయండి..

దీపాలు వెలిగించి ఐక్యతను చాటించాం కదా,
ఇప్పుడదే ఐక్యతను నిరూపించుకుందాం పదా!!

-


20 JUL 2018 AT 11:40

సహాయం

హృదయం ఎక్కడున్నదో అందరికి తెలుసు.... 
ప్రేమ ఎప్పుడు పుడుతుందో కొందరికే తెలుసు..... 
మంచి చెడులు ప్రతి ఒక్కరికి తెలుసు..... 
కానీ సహాయం చెయ్యడం మాత్రం బాధ అనుభవీంచినవారికే తెలుసు.......

-


7 MAR 2018 AT 11:51

ఈ వేళ పొ౦దిన సహాయం
రేపు మరచిన...
సహాయపు ఫలితం గడియ గడియకు
సూదిలా అ౦తరాత్మను గుచ్చుతూ చూపిస్తు౦ది...
పొ౦దిన సహాయాన్ని మరవకు
మరల సహాయాన్ని పొ౦దే అవకాశాన్ని చేజార్చుకోకు

-


23 MAY 2021 AT 11:45

తొంభైతొమ్మిది సార్లు సాయం చేసినపుడు
నువు దేవుడివవుతావ్ వాడికి...
అదే ఆఖరిసారి వీలుపడదన్నపుడు
నువు శత్రువవుతావ్...
ఒక్కసారేగా శత్రువయ్యేది
మిగతా తొంభైతొమ్మిదిసార్లూ నువు
దేవుడివేగా... చేసేయ్ సాయం వీలైనంతగా...
వెన్నెల సతీష్...

-


16 APR 2019 AT 9:52

చెప్పేవారు ఎందరున్నా
వినేవారి కోసమే మన నిరీక్షణ
ఉచితమైన సలహాలకన్నా
ఖరీదైన సహాయమే మిన్న

-


19 JUN 2018 AT 0:04

సహాయం ఆశిస్తున్నాననే వంకతో
ఉచిత సలహాలు ఇవ్వాలనుకోకు.🤘

-


27 FEB 2020 AT 12:45

సహాయం అడిగితే సలహాలు రావొచ్చు
సలహాలు అడిగితే సహాయం రావొచ్చు

సహాయమైనా, సలహాలైనా వ్యక్తిత్వం నుంచే వస్తాయి
వ్యక్తిత్వాలన్నీ ఒకేలా ఉండవనేదే ఈ జీవిత సారం.🤘

-


6 JUN 2022 AT 23:58

నీవు ఎవరికైనా సాయం చేయడంలో
విజయం సాధించినట్లైతే...
నీవు నీ జీవితంలో విజయం సాధించినట్టే...

-


19 MAY 2021 AT 21:59

నువ్వు చేస్తున్న సహాయం చూసి పదిమంది మారుతారు అనుకుంటే,
నీ సహాయం చిన్నదైన సరే పదిమందికి చూపించు..!!!

-