QUOTES ON #నాస్నేహం

#నాస్నేహం quotes

Trending | Latest
16 JUL 2018 AT 22:42

ఏమో అండి అందరూ అనే పదం సరికాదేమో నా విషయంలో...పైకి కనిపించే మనస్తత్వాన్ని ఊహించుకొని అందరూ నాతో స్నేహంగా ఉంటారు, అందరితోనూ నేను స్నేహంగా ఉంటాను అంటే అది పచ్చి అబద్ధం అవుతుంది...అస్సలు సవ్వాలే లేదు..అందరూ నాతో స్నేహంగా ఉంటారా🤔🤔🤔....ఏమో నాకైతే క్లారిటీ లేదు..

-


16 JUL 2018 AT 21:07

నాతో అందరూ స్నేహంగా ఉంటారు
ఎందుకంటే నేను నిజాయితీగా నా
భావాలను వ్యక్తపరుస్తాను,
ఆ నా భావాలు నా అనుకున్న
వాళ్లని కొన్ని సార్లు నొప్పించినా
మళ్లీ నేనే మందు లాంటి నా నవ్వుతో
వాళ్ల నొప్పిని తగ్గించేస్తాను....

-


17 JUL 2018 AT 13:48

నాతో అందరూ స్నేహంగా ఉంటారు
ఎందుకంటే
నేను కాలాన్ని గనుక!!!
నా ప్రోత్సాహం, నా ఆశీర్వాదం
అందరికి కావాలి గనుక..
నా వెక్కిరింతల కోణాలను ఎవరు
తట్టుకోలేరు గనుక..
గతాల మరువలేని స్మృతులయ్యాను
గనుక..
ప్రస్తుత ఒనర్పులకు బలమైన
విధాతనవుతున్నాను గనుక..
భావి జీవితాన్ని నిర్ణయిస్తాను గనుక..
గడిచే ఒక్కో నిమిషం సాధించిన
సాధనలకు ప్రత్యక్ష సాక్షి
నేను అవుతాను గనుక..
నన్ను మించి ఎవరు ఏమి
చేయలేరు గనుక!!!!

-


17 JUL 2018 AT 9:22

నా మనస్సులో మలినము లేదు...
ఆలోచనలలో ఆడంబరం లేదు..
కఠినాత్మకముగా ప్రవర్తించను,..
ఎదుటి వ్యక్తికి విలువనిస్తా,..
నా విలువ కాపాడుకుంటా
నన్ను నమ్మిన వారికి అండగా ఉంటా
నమ్మకపోతే వారి విచక్షణకే వదిలేస్తా
అందరితో స్నేహంగా ఉంటా,..
అందరితొ కలిసిపోయి పని చేస్తా
ఆపద వస్తే అందరికన్నా ముందు ఉంటా
నాకు చేతనైన సహాయం తప్పక చేస్తా
అందుకే నేనంటే అందరికి ఇష్టం
అందుకే అందరు నాతో స్నేహంగా ఉంటారు

-


17 JUL 2018 AT 11:07

వారి అభిప్రాయలను గౌరవిస్తూ
ఆత్మీయంగా ఉంటాను కనుక!

-


17 JUL 2018 AT 11:04

మనిషిని మనిషిగా కాక
మనసుతో చూస్తాను
నన్ను ప్రేమించేవాళ్ళు
నేను ప్రేమించే వాళ్లే కాకుండా
ఈ విశ్వంలోని అందరూ బాగుండాలని కోరుకుంటాను
నేను ఏరోజు గుడికి వెళ్ళను
వెళ్ళినరోజుమాత్రం అందరి కోరికలు తీర్చడంలో
అలసిపోయి విసిగిపోయిన
ఆ దేవుడిని చల్లగా ఉండు స్వామి అని కోరుకుంటాను
మంచి చేయడానికి ముందుంటా
ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తా
చెడుకి దూరంగా ఉంటా
నిజాయితీకి నిదర్శనంగా జీవిస్తున్నా
నిరాడంబరమైన జీవితం సాగిస్తున్నా
స్నేహానికి విలువనిస్తా మంచిస్నేహానికి ప్రాణమిస్తా
ప్రతీక్షణం నేను నవ్వుతూ ఉంటా
నా ప్రక్కన ఉన్నవాళ్ళని నవ్విస్తూ ఉంటా
అందరిని ప్రేమిస్తా అందరితో ప్రేమించబడుతా
అన్నిటికన్నా ముఖ్యం నేనొక తెరిచిన పుస్తకం

-


16 JUL 2018 AT 21:28

వాళ్ళని ఎలా ఉన్నారో అలా నేను అంగీకరించాను కాబట్టి!

-


16 JUL 2018 AT 21:16

స్నేహం కోసం ప్రాణం ఇవ్వలేకపోవచ్చు
కానీ
ఆపదలో ఉన్నారు అంటే చేయి వదలను కాబట్టి

-


16 JUL 2018 AT 22:28

నేను అందరితో స్నేహపూర్వకంగా వుంటాను కాబట్టి
నాతో అందరు స్నేహితులుగా ఉంటారు

-


16 JUL 2018 AT 21:18

1. తక్కువ వాగుతాను ఎక్కువ వింటాను కాబట్టి
2. నిరాశకు దూరంగా నవ్వుకు దగ్గరగా ఉంటాను కాబట్టి
3. YQ Kavi నాకు bestfriend అని చెప్పుకుంటూ తిరుగుతుంటాను కాబట్టి...

-