QUOTES ON #జీవితం

#జీవితం quotes

Trending | Latest
16 FEB 2019 AT 11:05

ఎవరి మీదైనా సరే లేని ప్రేమని నటించకండి,
మీది నటన కావచ్చు కానీ ఎదుటి వారిది జీవితం..

-


24 MAR 2020 AT 13:23

మనిషి కాదది
మహమ్మారి రోగమట

మాట వినుకుంటే మనిషి
మనుగడే మటుమాయమట

మనిషిని మనిషి కలువొద్దంటే
మారాజల్లే పోసు కొడుతుంటివి

మా వాడు మీ వాడు అనేదేం లేదిక్కడ
మహమ్మారి రోగానికి మనందరం ఒకటేనట

పండుగుందని పని ఉందని రోడ్లపై తిరుగుతుంటే
పాడెనెక్కి పోయేందుకు ప్రయత్నం చేస్తున్నమాటే

సర్వేజనాః సుఖినోభవంతుకి అర్థం ఏమిటంటే
శవాలను కూడా అనాధలుగా చేయకుండా ఉండడమట

అవును మరి,

ఆ మహమ్మారి మనిషిని ముద్దాడిందంటే
కడచూపును కూడా పొందలేక ఏడ్చి ఏడ్చి చస్తామంట.🤘

-


17 JAN 2020 AT 8:38

మనవికాని మన బ్రతుకుల్లో
మనమే లేనపుడు
ఇంకా ఎందుకివన్నీ...
దేహాన్ని పోషించడానికా... ???
వెన్నెల సతీష్...

-


14 JAN 2020 AT 13:59

చేజారిన జీవితం
జ్వాలలో పడ్డాక
ఆశలన్నీ కాలి అనంతంలో కలిసాక
ఇప్పుడు తనో పవిత్రమైన బూడిద

-


19 APR 2020 AT 19:21

మన్నించు నేస్తమా
మరలిరాని నా స్నేహమా
మరుస్తున్న మది జ్ఞాపకమా

కానరాని లోకంలోకి
కనుమరుగైన ఓ స్నేహ కపోతమా

కలలోనైనా నను కనికరించి
కనిపించు కరుడుగట్టిన ఓ పాపమా

ఆత్మహత్య పాపమంటూ నరకశిక్ష నీకేనా
నిను హత్య చేసి పంపేసినీ సమాజానికి శిక్ష ఒక కల్లేనా.🤘

-


13 APR 2021 AT 0:24

అతను ఆమె ఓ ప్రేమ కథ
ఆమెను పల్లకిలో కూర్చోపెట్టారు
అతనిని పాడిపై పడుకోపెట్టారు
ఆమెను పూలతో అలంకరించారు
అతనిపై పూలను పరిచారు
ఆమెను నలుగురితో కూర్చోపెట్టారు
అతనిని నలుగురు మోసుకెళ్ళారు
ఆమెది కొత్త జీవితానికి తీసుకువెళ్తుతారు
అతనిని ఆఖరి మజిలీ మోసుకువెళ్తున్నారు
ఆమె కోసం ఆనంద కేరింతలు
అతని కోసం గుండెలదిరే రోదనలు
ఆమె కోసం పురోహితుల మంత్రాలు
అతని కోసం కాటికాపరి నిష కబుర్లు
ఆమెకి అక్షింతాల ఆశీర్వాదాలు
అతనికి అశ్రునయనాల వీడ్కోలు
ఆమెది బంధాలు కలుపుకునేందుకు తొలి ప్రయాణం
అతనిది బంధాలు తెంపుకొనేందుకు ఆఖరి ప్రయాణం
ఆమెది నూతన జీవితం కోసం పయనం
అతనిది ఆమె కోసం అంతమ్మైయే గమనం..!!!

-


2 APR 2020 AT 13:20

లక్ష్య సాధనలో అపజాయాలెన్నున్నా
అలుపు చెందక ఎదురీదాలి ఎవరైనా. . .

-


3 OCT 2019 AT 23:23

అరెరే కన్నీళ్లు జారిపోతున్నాయా
జారిపోతున్న కన్నీళ్లకు అక్షర రూపం ఇచ్చేసెయ్

అరెరే ఆకలి కేకలు బాధిస్తున్నాయా
బాధిస్తున్న ఆకలికి అక్షర నైవేద్యం అర్పించేసెయ్

అరెరే నిరాశలు చింత పెడుతున్నాయా
చింత పెడుతున్న నిరాశకు అక్షరాలతో చితి పెట్టేసేయ్

అరెరే మరణం సమీపిస్తోందా
సమీపిస్తున్న మరణాన్ని నీ అక్షరంతో జయించేసేయ్

క్షరమే లేనిది అక్షరం, మరణమే లేనిది రచన...✍️🤘

-


16 JUL 2019 AT 18:14

ఎంత వెతికినా
జీవితాన్ని మించిన గురువు,
జీవితాన్ని మించిన పాఠాలు
నాకు కనబడడం లేదు..

-


26 APR 2018 AT 0:21

నావరకు జీవితమ౦టే
మిగిలు౦దనుకు౦టే గడపాల్సి౦దిక నీతోనే ముగిసిపోయి౦దనుకు౦టే నీతో గడిచిపోయి౦దనే

-