తన ప్రాణం పోతున్నా
మనకు ప్రాణం పోసి,
ఈ ప్రపంచానికి మనల్ని
పరిచయం చేస్తుంది...-
నాకొసం నీ జివితాన్ని త్యాగం చెసి,
నేనే నువ్వు అంటు నా వెంట
నడిచిన అమ్మ నీకు వేల నమస్కారాలు
నన్ను నవమాసాలు మోసి,కనీ,పెంచి,
నా కష్ట సుఖాల్లో పాలుపంచుకున్న
ఓ మంచి అమ్మ నీకు వేలవేల నమస్కారాలు
నీ గురుంచి చెపుతూ నన్ను నేను
మరిచానమ్మ నీ మీద కవిత్వం
రాస్తూ నిన్ను తలిచానమ్మా...
-
అమ్మా నేను గమనిస్తున్నా
రోజు రోజుకు క్షీణిస్తున్న నీ ఆరోగ్యాన్ని,..
రోజు రోజుకి చిక్కి శల్యమవుతున్న నీ ఆరోగ్యాన్ని
అలుపన్నది లేక నీవు చేస్తున్న పనులను,..
అర్ధాకలితోనే నువ్వు నిద్ర పోయిన ఎన్నో రాత్రులను
నీలోని మానవత్వం నిండిన మంచి మనిషిని
నీకే సొంతమైన అందరినీ కలుపుకుని నడిచే మంచి మనసును
అందరినీ నొప్పించక ఒప్పించ గలిగేలా నువ్వు మాట్లాడే చల్లని మాటలను
ఓర్పూ సహనంతో అందరి బాగోగులు అడిగి మరీ తెలుసుకుని తోచిన సహాయం చేసే నీ గొప్ప మనసును
ముందుగ అందరికీ పెట్టి మిగిలిన బువ్వ తినే నీవు
లోలోపల ఆరోగ్యం క్షీణిస్తున్నా బయటకు మాత్రం నవ్వతూ నటించే నీ నవ్వులో దాగిన బాధను నేను గమనిస్తున్నా,..
నువ్వు చదివించిన చదువులు,.నాకు ఉద్యోగమివ్వ లేక పోయాయి,..నువ్వు పడుతున్న బాధలు చూడలేక,..దిక్కు తోచక ఏమి చేయలేక నేను కుమిలిపోతున్నా,..నీ రుణం తీర్చుకునే రోజు వస్తుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నా
-
Why is the mother son bond so strong..?
The child depends on the mother for almost everything, and this secure attachment with the mother forms the foundation for a strong bond. ... The son picks up his first emotions from the mother and as the nurturing continues, he grows up to be emotionally intelligent and strong.. #Amma #అమ్మా ❤️-
" అమ్మా ... నా ఈ జన్మ "
ఇంతమందిని కనటం తప్పు
ఇందరికి జన్మ ఇవ్వటం పొరపాటు
అనీ ...
అమ్మా ... నువు కన్నపేగే అంటుంటే
కంట తడి ఆగలేదు
గుండె కవాటం ఆడలేదు
మనసు మూగదై మరి మోగలేదు ...
ఇందర్ని కంటేనే కదా ...
మాకు కాసిన్ని నీళ్ళు విడిచిపెట్టే
నువు పుట్టావురా ...
నీకోసమే నాయనా
ఆ అందర్నీ మోసాను, కాచాను
అనీ ...
అమ్మా... నువు స్వప్నంలో చెబుతుంటే
బాధను మరిచాను
రోదన వీడాను నే నీ ఒడిలో సేదనుతీరాను
అమ్మా ... అలా తరించేను నా జన్మ ...
... ✍ "కృష్ణ" కలం
-
పచ్చి నెత్తురును పాలుగా మార్చి
పొత్తిల్లలోని పంచ ప్రాణాలను నిలిపేది.-
అమ్మ భూమి! అమ్మ సముద్రం! అమ్మ కొండ! అమ్మ నది! అమ్మ ఆకాశం! అమ్మ ఊపిరి! తన రక్తాన్ని మనకు పంచి , నవమాసాలు మోసి , మల మూత్రాలు కడిగి , చిట్టి చిట్టి అడుగులు వేయించి, ఒళ్ళో జోకొడుతూ అక్షరాలు నేర్పించి , బళ్లోకి పంపి , నీ ఎదుగుదల చూసి , తాను పొంగి పోయే మాతృమూర్తుల దినోత్సవం నేడు🙏 అందరికీ శుభాకాంక్షలు 🌸🌹🌼
#HappyMothersDay-
అందరూ అంటారు అమ్మ ప్రేమ అంటే ఇది నాన్న ప్రేమ అంటే అది అని...
కానీ నా ఉద్దేశం లో అమ్మానాన్న ప్రేమ వర్ణించడానికి వీలు కానిది, వీలు లేనిది...!
-