QUOTES ON #YOURQUOTEKAVI

#yourquotekavi quotes

Trending | Latest
24 APR 2020 AT 22:53

అమృతమంటి సంగీతం
కర్ణ కోమల సుస్వర సరాగం
మించిన
రమణీయం
సరిగమలు లేని మధురిమలు
మనసు ఆలకించిన మౌన రాగం
ఓ ప్రశాంత నిశబ్దరాగం

-


30 MAY 2020 AT 15:27

నీ మతాన్ని పాటించు
ఇతరుల మతాన్ని గౌరవించు

-


2 APR 2020 AT 1:02

బిగించి కట్టిన కట్టెల మూటలా, గుండె బిగుసుకుపోతుంది.
మనసు వైపుకు తన మాటలు, అభికేంద్రబలంలా పనిచేస్తాయి.
అలలు తెచ్చి పడేసిన ఇసుకలా,భాధ పేరుకుపోతుంది.
ఓ భయంకరమైన పీడకల నిద్రని చెరిపేసినట్టు,ఆనందం చెరిగిపోతుంది.
తుఫాన్ ముందు వాతావరణశాఖ హెచ్చరిక ఇచ్చినట్టు,ఓ క్షణం పాటు మది మోయలేని మౌనం అలా వచ్చి వెళ్ళిపోతుంది.

-


29 APR 2020 AT 5:33

కాలానికి కలం స్పందిస్తే కవిత్వం..
కలానికి కాలం స్పందిస్తే ఉద్యమం..!!

-


28 NOV 2020 AT 17:21

కాగితపు కళావేదికపై
ప్రాసలగజ్జెలు కట్టుకొని నర్తించే పదకన్యలు
నా కవితాసీమ అప్సరలు..!!

-


29 APR 2020 AT 22:29

ఆటపాటలతో సాగవలసిన బాల్యాన్ని
ఆవహించింది దరిద్రం..
అమాయకపు బాలల బ్రతుకులను
చేసింది అది ఛిద్రం..
మబ్బు మెరిస్తే
ప్రేలిపోతారో తెలియదు
జబ్బు కరిస్తే
రాలిపోతారో తెలియదు

బడికి వెళ్ళడమే నేరంగా
గుడిమెట్లే ఆశల తీరంగా
ఆవహించిన దరిద్రాన్ని
అమ్ములతో చీల్చేసి, రొమ్ములను కూల్చేసి
తనువెల్లా పేల్చేసి, నిప్పులై కాల్చివేద్దాం..

వారి ఆకలి చరుపులకు
ఆవేదనల కరుపులకు ధీటుగా,
రక్తాలు మరిగించి
రాతిగుండెల్ని కరిగించి
దయను గుమ్మరించి
గుణమెల్ల వడకట్టి, జాలి జల్లెడపట్టి
కరుణయేరిపెట్టి కొత్త ఔషదాన్ని సృష్టిద్దాం..!!

-


26 MAR 2020 AT 16:11

నాలో కవి అంధకారంలో నలిగిపోయేవాడేమో
కవితావనంలో నేనో ఒంటరి కవితా కుసుమంగానే వాడిపోయే వాన్నేమో
ఈ వైక్యూ ప్రపంచంలో
'గాలి' సౌరభం నన్ను మరింత పరిమలింపజేసింది
ప్రేమ 'లత' లు నన్ను అనురాగంతో పెనవేసుకున్నాయి
'సంధ్యా' కిరాణాలు 'అఘోర' చతుర్లు నాలోని అదృశ్య చమత్కార కవిని తట్టి లేపాయి

-


23 OCT 2018 AT 11:45

ఆలోచనలు
కదిలే ఆదిమ చక్రం
వెలిగే విద్యుద్ధీపం
డార్విన్ జీవం పుట్టుక
మార్క్స్ సామాజిక కోణం
ప్రపంచ యుద్ధపు ఆటంబాంబులు
అభివృద్ధి దేశాల ప్రపంచీకరణమూ!

ఆలోచనలు
భగత్ సింగ్ పోరాట ధీమ
భారతదేశపు శాంతిసందేశం
ఫిడేల్, గువారా ల స్వతంత్ర్య గర్జన
అణగారిన ప్రాంతాల ఆకలి దప్పికలు
అధికార రాజ్యాల అహంకార ప్రతిమలు

ఆలోచనలు
జాలువారే పదాలు
సరిగమల పదనిసలు
బాపుగారి బొమ్మలు
చదరంగపు ఎత్తుగడలు
రణరంగపు మృత్యుఒడులు

ఆలోచనలు
కూడులేని కుటీరాలు
శాంతి లేని భవంతులు
కునుకు లేని శ్రమ జీవితం
శ్రమ లేని కునుకు జీవితం

ఆలోచనలే
నా
జననం!
గమనం!!
మరణం!!!
(27-Feb-2017)

-


8 JUN 2019 AT 7:09

అందరి బాధ కన్నీళ్ల రూపంలో
జారి ఆవిరవుతే,
కవితా హృదయపు బాధ
అక్షరరూపము జేరి,
కవనపు సంద్రంలా మారి,
భీకర ప్రళయమై
ఎగసిపడె ఈ వెర్రిలోకాన..!

-


21 MAR 2021 AT 22:49

ఇనప్పెట్టె..
( In Caption )

-