QUOTES ON #TELUGUVELUGU

#teluguvelugu quotes

Trending | Latest
9 JUN 2018 AT 21:01

సు౦దరమైన
సు౦దరా౦గివే
సునయన
సునాయస౦గా
సుకుమారుడిని
సుడులు తిప్పే
సుమధుర
సున్నిత
సులేపనాన్ని
సుతార౦గా
సుగుణ౦లా దాచుకున్న
సురకన్యకు తీసిపోని
సురభివే
సుమనోహరి
Love u darling.. 💕💕💕

-


27 OCT 2017 AT 12:07

తరలుతున్న స్వప్నమా,
కదులుతున్న
పసిడి శృంగారమా,
ఆ మంచుకొండల దరిలో
కాంతించు సూర్య కిరణమా,
మదినేలు ప్రకాశమా
జలతారువై మెరిసే మేనులా,
మదినేలే మేని మయూరమా
అనంత వాహినిలా
పరవళ్ళు త్రొక్కే మనోల్లాసమా,
నిసర్గ దేవతవై విరాజిల్లు
సుప్రభాతమా,
తెల్లని మంచంతయూ
బంగారు రష్మిలా కనబడుతున్నాయి
నా అక్షులదేమి అదృష్టం!!!
కనువిందు కలిగినది కదా
ఈ దివ్యకాంతులు గాంచి!!!

-


31 JAN 2018 AT 13:23

పునరపి జననం
పునరపి మరణం
పునరపి వృద్దా
శ్రమమే శరణం
ఇహ సంసారే
బహుదూష్ఠారే
కృపయా పారే
పాహి మురారే

-


24 MAR 2019 AT 9:58

Seascape to hillsides!
He always treasures to sheathe
every shades of her colours &
She always embraces to nursle
every fragrance of his smile.

-


8 FEB 2018 AT 23:21

ఔనని అంటావో లేక కాదని అంటావో కానీ
ఏమోయ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం...

నువ్వు ఆఫీసు నుంచి అలసిపోయి వస్తే
నీకు కాఫీ ఇచ్చి తలనిమిరే అంత ఇష్టం!
నువ్వు ఆదమరిచి నిదురవుతున్న వేల
నీ నుదుట పై ముద్దు పెట్టాలన్నంత ఇష్టం!
నువ్వు నీ బాధను మనసులోనే పెట్టుకున్నప్పుడు
నీ వెన్నుతట్టి ధైర్యం చెప్పాలన్నంత ఇష్టం!
నువ్వు చిన్ని కిట్టయ్యలా నవ్వుతుంటే
ఎవరి దిష్టితగలకుండా దిష్టితీసేయాలన్నంత ఇష్టం!
నువ్వు నన్ను నీ అర్ధాంగి గా చేసుకుంటే
నీలో సగంగా మారిపోదాం అనుకునే అంత ఇష్టం!

-


6 AUG 2020 AT 8:21

-


1 MAR 2021 AT 1:36

జననం మరణం ఆశయ ఖననం
సాగే రణమే జీవన పయనం
మంచికి చెడుకి రెంటికి అందని
మధ్యలి లోకం జీవన సమరం

మానని గాయం మారని వైనం
ఆశల తీరం మహా భూటకం
మాటలు మధురం మనసున వైరం
కల్లన బతుకే జగన్నాటకం

యుద్ధం యుద్ధం యుద్ధం యుద్ధం
అనుదినమనుక్షణం తప్పని యుద్ధం
గూటికి నీటికి కూటికి కాటికి
అన్నదమ్ములకె జరిగే జగడం

హృది శాంతి కపోతం ఏ గూటినున్నదో?
మది ప్రేమ సాగరం ఎక్కడున్ననో?
అక్షయమక్షర ఆనంద సౌరభ
మకరంద సేవిత మిళిందమెక్కడో?

-



నెలవంక సైతం సిగ్గుపడే అందం తనది,
అలా చూస్తూ ఉండాలనే తపన నాది.

-


12 SEP 2019 AT 22:40

I didn’t coerce you,
You just transpired to be mine.
It’s never a miracle,
Because true love never faded
Yet grew every ties.

-


26 APR 2021 AT 10:51

సంపాదనంతా..
సావు దరిదాపులనెరుగదు,
ఆస్తిపాస్తులన్నీ..
అస్థికల దాకా రాలేవు,
అహం నీతోనే అంతం.
బంధుమిత్రులు..
పరిమితం , అశాశ్వతం మాత్రమే.

గాలి నిన్నొదిలి పోయిన వేళ
మట్టి మాత్రమే నిను హత్తుకునేది
చెట్టు కట్టెలే నిను సాగనంపేది
నిప్పు నిను మట్టిలో కలగలిపేది
నీరే నిను తనలో కలుపుకునేది

ఎటుల బ్రతికావో ఏమి చేసావో
ఆకాశమొక్కటే చూడగలిగేది
మంచి తనముంటే ఒక్క బొట్టు
జాలి కన్నీరు వానగా..
పాపాత్ముడ వైతే భగభగ మండే ఎండ
కాలుతున్న అగ్ని కి సాయంగా..

-