తొలి తెర దించగా వరుని కనులు వధువుని తాక,
చూపు సోకిన తనువున బిడియము బిగిసే ఎటు పోక!
సన్నాయు మేళాల మంగళవాద్యాల సవ్వడి కన్నా
వధువు గుండెసడి వరుని చెవిన చెరే బిన్నా,
మంగళసుాత్రాన్ని మూడుమార్లు ముడి వేయ, ఇరువురి కంట ఆనంద బిందువులు ఝర్రున జార!
చిటికెన వేలు పట్టి, ఏడడగులు నడిచి,
ఏడేడు జన్మాలకు తోడుగా ఉండాలని ప్రార్ధించి,
జతపడిన నవ బంధాన ప్రణయపు మధురిమ రుచి చూసి,
చనువున చిరు కోపాల మురిపాలు కలబోసి,
ఒకరికొకరు తొడుగా, నీడగా జీవించి
చివరి వయసుల క్షణాన అలనాటి పెళ్ళి ప్రమాణాలు మరల నెమరువేసి కాలంలో కరిగిపోదామా లేక తీరని కోరికలా మిగిలిపోదామా!!
-