Prasad Goud   (Prasad Goud Vootupally)
2.3k Followers · 219 Following

read more
Joined 27 April 2017


read more
Joined 27 April 2017
9 HOURS AGO

జీవితమనే రంగస్థలంలో నటించడమైనా రావాలి
నటిస్తున్న వారిని గుర్తించడమైనా నేర్చుకోవాలి.🤘

-


9 HOURS AGO

గెలుపు కథలను వింటారు కానీ
ఓటమి వ్యధలను పట్టించుకోరేమో

కథనాలను ఆలోచించి వినిపించు.🤘

-


16 APR AT 1:10

మీరు రాసే రాతలన్నింటిని
చాలా మందే చూస్తుంటారు
బాగా లేదని చెప్పడానికి ధైర్యం సరిపోదు
బాగుందని చెప్పడానికి అహం ఒప్పుకోదు.🤘

-


16 APR AT 0:09

పేరు
పదవి
పైసలు
పరపతి
ఇలా ఏదో ఒక దానికై

ఈ బతుకంతా ఆరాటాలు
ఈ జీవితాంతం పోరాటాలు.🤘

-


15 APR AT 14:46

కొన్ని రోజులు
కొన్ని సమయాలే
కొంత బాగుండదు

జీవితం అంతా బాగానే ఉంటుంది
బాగుండని క్షణాల గురించి ఆలోచించడం మానేయ్.🤘

-


15 APR AT 13:05

అవసరమో
అభిమానమో
ఈ రెండే మనుషులని కలిపుంచుతాయి
ఈ రెండూ లేకుంటే మనసులు విడిపోతాయి.🤘

-


15 APR AT 12:56

ఎవరింటికైనా
పప్పుకో, చక్కెరకో
ఇంకా దేనికోసమైనా
బదులుకి పంపినపుడు
ఆ బదులు ఇచ్చేటప్పుడు
అవతలి వారి ముఖ కవళికలు
జాగ్రత్తగా గమనించి రమ్మనేది అమ్మ

సహాయం తీసుకున్నా లేదా సహాయం చేసినా
మనసుల మధ్య మంచి బంధం ఉండాలనేది అమ్మ.🤘
( ఎవరి దగ్గర పడితే వారి దగ్గర సహాయం
అడగకూడదని చెప్పకనే చెప్పిన పాఠం అది)

-


15 APR AT 12:42

జీవితమనే యుద్ధంలో
నీకు వ్యతిరేకంగా పోట్లాడే నీవాళ్లను
నీకు అనుకూలంగా జతచేరే నీ శత్రువులనూ చూస్తావు.🤘

-


15 APR AT 11:44

కొందరు బిసీ ఉంటారు
కొందరు బిసీ ఉన్నట్టు నటిస్తారు
నీ కాల్స్, మెసేజులకి రిప్లైలు రాకపోతే
ఆ బిజీ పర్సన్లని డిస్టర్బ్ చేయకు మరి

వద్దన్నా కూడా ఏదో ఒక రోజు నీ టైం వస్తుంది
ఆ బిజీ పర్సన్ల కంటే బిజీగా ఉన్నానని చెప్పే రోజు.🤘

-


15 APR AT 2:07

కష్టం వచ్చిన
ప్రతీసారి దైవం వైపు చూడకు
ప్రపంచంతో దైవం బిజీగా ఉండొచ్చు
మనుషుల పైనా నమ్మకం ఉంచి చూడు
మనుషులు కూడా బిజీగా ఉంటారంటావా

కష్టం నీదైనపుడు ఎదుర్కొనే ధైర్యమూ నీదే
పరీక్ష నీకైనపుడు సమాధానం వెతకాల్సిన తెగువా నీకే.🤘

-


Fetching Prasad Goud Quotes