ప1 Kumar   (ప1)
641 Followers · 60 Following

read more
Joined 5 March 2018


read more
Joined 5 March 2018
19 APR AT 12:27

గాలి నన్ను నెడుతోందే నీ వైపు,
మదిలోని మాటను చెప్పేయమంటూ,
దారి నన్ను నడుపుతోందే నీ వైపు,
మన కధ తొలివలపు మలుపు చేరాలంటూ,
ధైర్యం చెప్పింది సమయం, సాయం చేస్తానంటూ,
సవాలు విసరింది విరహం, నాకిది చేతకాదంటూ,
ఇలా అంతా సైన్యమై వెనుకనే ఉన్నా?
నిన్ను గెలిచే మార్గం కనుగొనలేకున్నా,
ఇదిగో,అందర్నీ నీ వైపు పంపుతున్నా,
నీకు సులువుగ దొరకడమే నాకు గెలుపంటున్నా..!


-


12 APR AT 12:26

దిక్కులను అమాంతం మాయం చేసింది,
చెక్కిలి నొక్కులతో అశాంతం మాయ చేసింది,
లుక్కుల్లోని అయస్కాంతం మదిని లాగేసింది,
చుక్కల్లోని మెరుపు జలపాతం సొగసై దాడి చేసింది,
దివి కన్యకలకిది అశనిపాతం,
భువిపై వెలసిన కన్నె పారిజాతం..!

-


9 APR AT 13:33

గోవిందం గొప్ప ఆశా జీవి. రాశి ఫలం చూసుకుందామని తన రెండు కళ్ళని రెండింతలు చేసుకుని పంచాంగం తెరిచాడు. ఆదాయం - 8, వ్యయం-16 అని చూసి కలుక్కుమన్న గుండెతో కంగారుపడొద్దని ధైర్యం చెప్పాడు. వాటికెదురుగ కుడివైపు చూసాడు. అవమానం-12, రాజపూజ్యం-8 అని చూడగానే తమాయించుకున్న గుండె తట్టుకోలేదని పంచాంగం మూసేసాడు.
అంకెల చుట్టూనే, చుట్టుకున్న మనసులో యమ ఫాస్టుగ ఓ ఆలోచన మెరిసింది. ఇక ఆగలేదు. రెండు చేతులను, రెండు జేబుల్లో పెట్టుకుని తన ఆదాయాన్ని పెంచే ఆ ఎనిమిది మంది రాజపూజ్యల కోసం వెతుక్కుంటూ బయటకు కదిలాడు..!

-


9 APR AT 11:13


"బా..బా..య్, ఎప్పుడూ నాకు మేసేజింగు చేయని మన కోలనీలో కమల ఉగాది శుభాకాంక్షలు పంపింది బాబాయ్"
"మేసేజు చూసి మెలికలు తిరక్కు. ఆ మేసేజు నాకు వచ్చింది. ఒక్కొక్కళ్ళకి ఏం చెపుతాంలే అని ఫోన్లో ఉన్న అందరికీ సెండ్ ఆల్ కొట్టేసుంటుంది"
"ఇన్ ఫ్యాక్టరీ నాకు వచ్చిందండి"
"మల్లీ.. అది ఇన్ ఫ్యాక్టరీ కాదురా ఇన్ ఫ్యాక్ట్"
"అవునబ్బాయ్, నువ్వెవరెవరికి పంపావు శుభాకాంక్షలు?"
"అంత ఓపిక లేక వాట్సప్, ఫేసు బుక్కు స్టేటస్సులో ఉగాది శుభాకాంక్షలు అని పెట్టేసాను బాబాయ్, అందరు చూస్తారు కదా"
"వెరీ క్రేజీ లేజీ అబ్బాయ్ నువ్వు"
"అబ్బాయ్ గారు టీ గాజు గ్లాసులో ఇమ్మంటారా? ప్లాస్టిక్ కప్పులో తాగుతారా?"
"ఏందుకురా మల్లి? అబ్బాయసలే కష్టపడ్డు. గిన్నెలో ఉన్నది ఇసిరేయ్. నోరు పట్టి డైరెక్టుగ తాగేస్తాడు"
"అరే మల్లి.. బాబాయ్ గానీ ఫీలైయాడంటావా?"

-


6 APR AT 13:29

లోలోన వారికది మనసే అసలు,
పైపైన వద్దనే నటనే నకలు,
లోనున్నట్టే పైకి కనపడమంటే దిగులు,
పైన చూపినట్టే లోన మార్చుకోమంటే తెగులు,
తెచ్చిపెట్టుకున్న ముసుగు మోడెస్టీ,
తీసికొట్టి బతికితే తప్పేంటి? హోనేస్ట్లీ..!

-


5 APR AT 11:51

చిరునవ్వులు పూయించే చినుకువైతే,
సిరికాంతులు కురిపించే వెలుగువైతే,
మదికి శాంతి వరమునిచ్చే మాటవైతే,
సుందరం కాదా బతుకు అందరిదైతే..!

-


31 MAR AT 18:04

బరువైన పరువాన్ని నువు మోయలేకుంటే?
నే లేన నీ సాయమే,
అడగాలననుకున్న అడుగేద్దామని ఉన్నా?
ఆపింది నా బిడియమే,
నీ వైపు సాగేలా ఓ సైగ చాలంతే,
తీర్చైనా ఆ భారమే..!

-


27 MAR AT 12:42

చీరకట్టులోన చిన్నది,
చందమామ లాగు ఉన్నది,
తీరు వర్ణింపలేనిది,
వెన్నెల జలతారు నడుమది,
ఒంపులెన్నో నింపుకున్న తన్వంగి,
చెంత చేరి కొనగోట మీటనా సారంగి..!

-


23 MAR AT 18:33

పలుకే రాగమై ఒలికే,
చిలుకై స్వరాలే చిలికే,
గాలే సుమగంధాల తరంగమై,
మనసే వినీలాకశాన విహంగమై,
ఉరికే తన వీణ పలుకల వింటే,
కదిలే పదనిసలన్నీ తన వెంటే,
తేనెలో ముంచినట్టు ప్రతీ మాట తీయగా,
మక్కువ పెంచుతోందే మోహమాటం తీయగా..!

-


14 MAR AT 9:09

Tera life ki raaja hai tu,
Kisi haath ka baaza nahi tu,
Thoonkne dho, phenkne dho,
Chod na mat teri raasta,
Samay ko bhaagne dho, bhonkne dho,
Aaram se khao pasta..!

-


Fetching ప1 Kumar Quotes