Laxmi Narayana   (✍️లక్ష్మీ నారాయణ D.)
792 Followers · 470 Following

Joined 4 January 2018


Joined 4 January 2018
5 JAN AT 4:23

తీరం చేరని అలలెన్నో..
కాలం కదపని కథలెన్నో..
మౌనం విడువని జతలెన్నో..
మనసుని వదలని వ్యథలెన్నో..

-


23 JUN 2020 AT 14:19

జీవితం కూడా యుద్ధం లాంటిదే...క్షణ క్షణం పోరాడందే విజయం సిద్దించదు...

-


16 JUN 2020 AT 0:15




జ్ఞాపకాలు..

మధురోహల పరిమళమై
సుమగంధం వెదజల్లును...!

మోయలేని భారమై
మోడుబారి మిగిలిపోవు..!

౼లక్ష్మీ నారాయణ D.







-


15 JUN 2020 AT 23:13

కళ్ళల్లో దాగు కన్నీటి చుక్కలు
కడదాకా తోడు కన్నీటి చుక్కలు
కడలల్లే మారు కన్నీటి చుక్కలు
కవితలై పారు కన్నీటి చుక్కలు
౼లక్ష్మీ నారాయణ D.

-


10 JUN 2020 AT 6:41

నీ జీవితం జీవించడానికే
అంతకు మించి ఆలోచించకు

-


31 MAY 2020 AT 5:47

ఊహే ఊపిరికి
ఊసయింది
మౌనం మాటయింది

-


30 MAY 2020 AT 14:54

నిను మాటల్తో
మరిపించలేక నే
మూగబోతిని

-


28 MAY 2020 AT 17:52

జ్ఞాపకమై వెంటాడాలి
జ్ఞానబోధ చేయించాలి
చైతన్యం రగిలించాలి
చైత్రమై చిగురించాలి

-


29 MAR 2020 AT 22:52


మది సంద్రంలో
అలజడి రేగె
మరపురాని
జ్ఞాపకాలేవో
మరీచికలై
మరల మరల
ముల్లులా నను
గుచ్చేస్తుంటే


-


20 FEB 2020 AT 15:28





కడలి అలల మాదిరి
కనిపించని వ్యథే ఇదా?
కలసి రాని కాలమేమో
కనిపెంచిన ప్రేమదా?
కనులు ఎంత వెతికినా
కంటి పాప దొరకదా?

-లక్మీ నారాయణ D.

-


Fetching Laxmi Narayana Quotes