4 JUN 2018 AT 16:22

చూపు ఉండి ఏం లాభం..
తోటివారి బాధను చూడలేనప్పుడు..!
వినికిడి ఉండి ఏం లాభం..
ఎదుటి వారి కష్టాన్ని వినలేనప్పుడు..!

మాట వచ్చి ఏం లాభం..
నలుగురి తో మంచి పలకలేనపుడు..!
చేయి ఉండి ఏం లాభం..
ఇతరులకు సహాయం చేయలేనప్పుడు..!

స్పందన ఉండి ఏం లాభం..
అందరి మేలు కోసం స్పందించనప్పుడు..!
కదలిక ఉండి ఏం లాభం..
అవసరం ఉన్న వారికి అండగా కదలలేనప్పుడు..!

మనస్సు ఉండి ఏం లాభం..
అర్థం చేసుకునే ఆలోచన లేనప్పుడు..!
జీవించి ఏం లాభం..
జీవితం విలువ తెలియనప్పుడు..
సాటి జీవితాలకు విలువ ఇవ్వలేనప్పుడు..!!

- WriमनCA