అదే ఆత్మగౌరవం అది స్వచ్ఛమైన మీ ఆశయ సాధన కోసం ఎల్లప్పుడూ మీ వెంట ఉండే సరియైన ఆయుధం
-
ఆత్మ గౌరవం అది అత్యంత పదునైన కత్తి కంటే వేల రెట్లు పదునైనది!!
మనసు కంటే అంటే అత్యంత వేగమైనది!!
గాలి కంటే అత్యంత స్వచ్ఛమైనది!!
-
వ్యవస్థాపరమైన భరతజాతి ఉన్నతిని సమోన్నతంగా కాంక్షించాలని కోరుకుంటూ...
-
కుల,మత, జాతి, వర్ణ,లింగ,ప్రాంత, వర్గ విభేదాలు సృష్టించి రాజకీయాలకు వాడుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు!!
నిజాయితీ లేని,నీతిమాలిన రాజకీయాలు భరతమాత యొక్క భౌతిక,ఆర్థిక,సామాజిక, రాజకీయ,మతపరమైన స్వేచ్ఛా హక్కును కాలరాయడమే!!
-
మరో ప్రపంచం!!
స్వార్థపూరిత మనసులతో దూరం అత్యంత శ్రేయస్కరం!!
కుల మత జాతి వివక్షతలతో రాజకీయం చేయగల అర్ధరహిత
సమాజం!!!
వ్యక్తిత్వం లేని వ్యక్తిగత స్వార్థం, వినాశనాన్ని కోరుకునే స్వార్థపూరిత ఆశా ప్రపంచం!!!
-
మరో ప్రపంచం!!!
ఎంగిలి కూటికి కోసం ఆశపడే బ్రతుకులున్న స్వార్ధ పూరిత సుందర ప్రపంచం !!!
కక్కిన కూటికోసం ప్రయాస పడే
జాగరూకత లేని మనసున్న శునకానందం!!!
స్వార్థపూరిత మనసులతో దూరం అత్యంత శ్రేయస్కరం!!
-
కమ్ముకొస్తున్న ప్రళయాన్ని సైతం చిరునవ్వుగా మార్చి భరత మాత ఒడిలో ఒదుగుతున్న సైనికుడా ఓ శ్రామికుడా !!
శ్రమనే ఆశయంగా మలుచుకున్న ఈ కార్మిక సిద్ధాంత నావికుడా!! మన కర్మ సిద్ధాంత రథ సాధకుడా !! వందనం నీ శ్రమకు నీరాజనం!!-
కార్మికుడా! ఓ శ్రామికుడా!
నెత్తుటినే ఇంధనం గా మార్చి నేలతో నాట్యం చేస్తున్న కర్షక జీవుడా! శ్రమతో ఆకలి తీరుస్తున్న మహాత్ముడా!!
కుటుంబమే పరమావధిగా గాంచి కాలం తో జేసే ఈ ప్రయాణ కార్మికోత్తముడా!!
-
దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహమ్ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే!!!
-