Maneesha Basaiahgari   (Mani Potter)
1.6k Followers · 49 Following

28
Potter head
Trying to figure out who I am !
Joined 1 April 2017


28
Potter head
Trying to figure out who I am !
Joined 1 April 2017
15 APR AT 13:18

వాలి పుట్టాడు వేటగాడిలా,
ప్రాణం తీశాడు రాముడిలా.

కురుక్షేత్రాన్నే గెలిపించిన కృష్ణుడు,
కూలిపోయాడు సామాన్య జీవిలా!

రామాయణమో, భారతమో,
కల్లా కపటం నిలవుండే కలియుగమో...

కాలమేదయినా కర్మ వదలదు,
నీది నీకిచ్చేదాకా అలసిపోదు!

-


15 APR AT 12:54

అనగనగా ఒక జీవి
ఎగురుకుంటూ వెళ్ళింది,

మెత్తగా ఉన్నదని
సీత కోకపై‌ వాలింది!

మేనులోని అందాన్ని,
చీరలోని‌ రంగుల్ని,
అరువిమ్మని అడిగింది,
ఆ జీవి అవనిజని!

కాదనలేని సీత,
సరేలే పొమ్మంది..
ఆ జీవి కాస్తా,
సీతాకోక చిలుకలా మారింది!

-


13 MAR AT 18:35

ఆది, అంతం, లేని దీన్ని,
సెకనులతో కొలవడం ఏంటో..

నిజానికి గడిచిపోతున్నది
సమయం కాదు,
నీ జీవితం !

-


2 FEB AT 16:53

అల అందంగావుందని
ఆనందిస్తున్నావా?
నీ కాళ్ళని తాకినట్టే తాకి,
వాటికింద ఉన్న ఇసుకను
తీసుకెళ్ళిపోయింది.
గమనించావా?

జీవితం నీ నుండీ ఏంతీసుకెళ్ళినా..
నీ ధ్యాస పోగొట్టుకున్నదాని మీద కాదు,
నీ ముందు అందంగా నిలబడివున్న
భవిష్యత్తు మీద పెట్టు!

ఎలా అయితే
ఆ అలల్ని చూస్తూ ఉండిపోయావో..
అలా!

-


24 JAN AT 19:18

నిన్న, ఈరోజు కోసం...
ఈరోజు, రేపటి కోసం.

ఇలా ప్రతీ రోజూ,
నువు కలగనే రోజు కోసం గడిపేస్తే..

గడిచిన రోజుల్లో,
ఏ‌ రోజూ నీకు గుర్తుండదు...

నువు గడిపేసిన సమయం,
ఏం చేసినా తిరిగిరాదు!


-


22 JAN AT 21:59

అందమయిన చందమామ ఆకాశంలోనే ఉన్నదని,
బువ్వ తినలేదు బాల రాముడు,‌ తన చెంతకది రాలేదని !

'అద్దంలో చూడు, నీ ముందే వుంది' అంటే,
చప్పట్లు కొట్టాడు చిన్ని రాముడు..
చంద్రుడే తన చేతికి చిక్కాడని,
సంబరపడిపోయాడు బాల రాముడు!

విధితో చేసే యుధ్ధాలు, మొదలవ్వని సమయమది..
కాలం తెచ్చే కష్టాలు, కానరాని బాల్యమది.

బాల రాముడేగా, ఆనంద రాముడు...
ఇంటికి‌ దూరమయి, ఇన్నాళ్ళకు చేరాడు!




-


18 JAN AT 19:12

వేదపాండిత్యాలను చదివాడు రావణుడు.
వాటి సారం మాత్రం గ్రహించింది, రాముడు!

రావణుడు, సీతను సొంతం
చేసుకుంటే చాలనుకున్నాడు ...
రాముడు మాత్రమే, సీతను
గెలవాలనుకున్నాడు,
గెలిచిన తర్వాతే
పొందాలనుకున్నాడు!

-


18 JAN AT 18:44

They were called 'Witches' then.
They are called 'Bitches' now.

But what they really are,
are merely women,
speaking their mind !

-


26 DEC 2023 AT 19:06

ద్రుపదుని కూతురని
ద్రౌపది అన్నారు,
యజ్ఞం నుండీ పుట్టానని
యజ్ఞసేని అన్నారు.

నల్లగా ఉన్నందుకు
'కృష్ణా' అని పిలిచారు,
నాది పాంచాల దేశమని
పాంచాలిని చేసారు.

నన్ను నన్నుగా గుర్తించేదెవరు?
గుర్తిస్తే, వారి నుండీ వచ్చేది, ఏ పేరు ?

-


21 DEC 2023 AT 8:49

I take a deep breath,
close my eyes and let it out.

It's good to be reminded
once in a while,
that I am not dead
and still alive !

-


Fetching Maneesha Basaiahgari Quotes