Chandra Mouli  
863 Followers · 96 Following

read more
Joined 10 December 2017


read more
Joined 10 December 2017
29 DEC 2022 AT 12:45

భావాలను వ్యక్తీకరిస్తేనే బలపడతాయి.
మనసులో పుట్టిన భావాలను మనసులోనే పొదువుకుంటూ పోతే నీటి కెరటాల్లా అభేదంగా మెరిసి మనస్సంద్రంలో మునిగిపోతాయి.
మనసు దాటి మాటగానో పాటగానో పొంగిపోతూ వస్తే, బడబానలాల్లా విలక్షణంగా వెలిగి భావద్వీపాలుగా మిగిలిపోతాయి.

-


29 OCT 2022 AT 22:00

ఒక శిల్పి శిలను చెక్కుతున్నపుడు, ఉలికీ శిలకూ నడుమ జరిగే ఘర్షణకు అద్దం పట్టేవి - ఎగిరిపడే నిప్పుల రవ్వలు, ఎగసి వచ్చే లోహపు రవములు.
రవివర్మ రచనలను పరిశీలిస్తే అలాంటి రవ్వలూ, రవములూ స్ఫురణకు వస్తాయి.
అంటే, ఒక కళ రూపుదిద్దుకుంటున్నపుడు జరిగే ఘర్షణను పోలిన అభివ్యక్తి తనలో ఉంది. అందుకని ఏ విషయం చెప్పినా అది తీక్షణంగా ఉంటుంది.
తన రచనల్లో శబ్దసౌందర్యం కన్నా భావ ధ్వని కన్నా రసధునికి ఎక్కవ ప్రాధాన్యత కనబడుతుంది. విశ్లేషణా శక్తి విరివిగా విశదపరుస్తూ మానవ మౌలిక భావాలకు,
చిన్ననాటి చందమామ సారాలకు, సమకాలీన సాంఘిక అంశాలకు, పఠం కట్టి ప్రదర్శిస్తాడు. నిర్దుష్టత, స్థితప్రజ్ఞత లాంటి ఎల్లలను చెరిపి - అపారమైన సహజ స్పందనతో చేసే అనూహ్యమైన భావావేశ కవనం ఆకట్టుకుంటుంది. ప్రక్రియను ఒడిసిపట్టుకుని కవిత్వం రాయడంలో విశిష్టమైన చాకచక్యం కనబరుస్తాడు. పడికట్టు పదాలు, వాడి వాడి అరిగిపోయిన పదబంధాలు ఉండవు. అనవసరమైన అంత్యప్రాసలు అసలుండవు. పదునైన మాటలు(అంటే చుక్క రక్తం లేకుండా చీల్చి చెండాడగలిగినవి) కూర్చి తన భావాలకు వత్తాసుగా సమస్త ప్రకృతిని నిర్దేశించగల కవి.
నిలకడ ఉన్న చోట గుర్తింపు దానంతటదే వస్తుంది.
ప్రతి రోజూ పొడిచే పొద్దుకి ప్రచారం అక్కరలేదు కదా!

-


14 MAY 2021 AT 7:40

కారణాలూహించడంలో కాలయాపన
చేయని చురుకుదనం లోకానిది.

-


13 MAY 2021 AT 23:02

రోజంతా మనుషులతో రిడండంట్ సావాసం
అనాసక్తి పులిమిన హావభావాలతో రాపిడి
వడలిపోయిన ముఖోత్పలమును
యామిని దయతో తన దోసిట్లోకి తీసుకుని
చల్లని చుక్కల తుంపర్లతో మోమంతా తుళ్ళింతపరిచింది
పగటి పలకరింపుల వలన ఏర్పడిన కల్మషాలను కడిగేసింది
తారా కాంతి ప్రతిబింబించిన నా మోముపై
పల్చని ప్రసన్న పొర పొడిచింది
తెల్లని వెన్నెల నగవు పూసింది
కాలన్ని లెక్కిస్తూ మెదడు కదలకుండా నిలిచిపోయింది
అదుపులేని ఆలోచన అందకుండా సన్నగిల్లింది
మసకబారిన అయోమయం విడువకుండా ఆవరించింది
ఆటంకం లేని ఆహ్లాద సమయాన్ని నిద్రలో ముంచేసాను!
మిన్నంటి మిలమిల మిటకరిస్తూ నన్నలరించిన తార
చిట్టచివరి మిణుకు ఉషస్సులో కరిగిపోయింది

-


9 DEC 2020 AT 17:25

అనురాగము కోరుకుంది
ఒదగలేని భావమేదో
ఎద నిండా చూరుకుంది

-


30 NOV 2020 AT 11:30

రోహిత్, కవి
కవిరాజభోజ, పవి
కవనవేదిక, దివి
పదగాంభీర్యం, భువి

(more in caption)

-


27 NOV 2020 AT 20:33

ఒడిలో కడలిని ఓలలాడించే
వలువగ వాయువును చుట్టే
ప్రాణానికి ప్రాణంపోసి పుష్పించే
పురివిప్పే ప్రకృతిని ఆలించే
జీవన తరంగిణిని ఒనరించే
పుడమి నీవైతే, పుడమే నీవైతే
అణువు నీవైతే, అణువణువూ నీవైతే
అండము నీవైతే, బ్రహ్మాండము నీవైతే
పుడమీ నీవైపే, జగతీ నీవైపే

-


25 NOV 2020 AT 19:58

పొందినది ఒప్పిదము కాదు
అసలు పొందితినో లేదో తెలీదు
పొందడమంటూ ఒకటున్నదా
పొందినననుకోవడమే ఉన్నదా
అందుకొనగల ఎత్తులున్నవి
చేరుకొనగల దవ్వులున్నవి
కానీ, కాళ్ళకింద నేలున్నది
నేలపైన నిలకడున్నది
కదలక నిలబడిపోదునా
కలబడి సాధన చేతునా
ప్రవాహమున్నది నావున్నది
విసుగులేక సాగిపోవుటయా
ప్రచ్ఛన్న శక్తిని రగిలించి
అంతెరుగక ఎగిరిపోవుటయా
జీవనస్రవంతిలో ఏదో వెలితి
కాలస్రవంతిలో జీవన వెలితి

-


9 OCT 2020 AT 11:15

ఆమడ దూరంలో కూర్చున్నాను
అటుకేసి తదేకంగా చూస్తున్నాను
చూస్తూ చూస్తూ తనివిని అనుభవించాను
శరీరాన్ని ఎలా స్పృశించాలో ఆ గాలులకే తెలుసు
అంతర్ముఖ ద్వారాలను తెరిచే తాళాలు ఆ హోరులు
అనంత మైదానం లాంటి ఆ దృశ్యం,
మనసు విప్పి పరుచుకోడానికి
మాటల్లేకుండా తలుచుకోడానికి
ఏర్పడిన మైత్రీ లలామలా కనిపించింది
ఏకాంతానికి సముద్రం ఇచ్చినంత గౌరవం
ఇంకెవ్వరూ ఇవ్వలేరు అనిపించింది
అంత ఉదాత్తత వలనే భూమ్మీద
మూడొంతుల చోటు దక్కించుకుంది
తిరిగి జన సమూహంలోకి వెళ్ళాలని
గుర్తుకురాలేదు, వెళ్ళాలనీ అనిపించలేదు
సాగరం పక్కన భవసాగరాన్ని పోలిస్తే
అధివాస్తవిక చిత్రంలా తోచింది

-


8 OCT 2020 AT 8:48

నీలి నింగిలో కాంతులు చల్లిన కోటి తారలు
కాంతి ప్రవాహం దోచి దాచుకునే కృష్ణ బిలములు
ఆద్యంతములు ఎరుగని విశ్వపుటెడారి దారులు
తడవలుగా తరలి వచ్చే నీ తలపుల తరగలు

-


Fetching Chandra Mouli Quotes